తిరుపతిరూరల్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన వరద బీభత్సం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు. స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైన గ్రామాలు, నిరాశ్రయులైన ప్రజలు, తెగిన వంతెనలు, స్తంభించిన రాకపోకలు, నీటమునిగిన పంటలు, జరిగిన నష్ట పరిణామాల గురించి విశదీకరించారు.
అదేవిధంగా వరద బాధిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన నష్ట పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital