Friday, November 22, 2024

Gangamma jatara: మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే భూమన

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం పట్టు చీర, సారె సమర్పించారు. అమ్మ వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక పద్మావతి పురంలోని తన నివాసం నుంచి బుధవారం పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులతో కలసి వూరేగింపుగా బయలుదేరారు. సప్పరాలు, కోలాటాలు, పిల్లనగ్రోవిలు, డప్పులు, సన్నాయి వాయిద్యాల మధ్య, భక్తులు విచిత్ర వేషధారణలతో,  లయబద్ద విన్యాసాలతో శోభా యాత్ర  గంగమ్మ ఆలయం వైపు సాగింది.

భూమన నివాసం నుంచి శ్రీనివాసా కల్యాణ మండపాల మార్గం, లక్ష్మీపురం సర్కిల్, డీఆర్ మహల్ రోడ్డు, గ్రూప్ థియేటర్స్ మార్గం మీదుగా కొనసాగిన ఆధ్యాత్మిక యాత్రకు దారి పొడవునా భక్తులు పసుపు నీళ్లు పోస్తూ,  పూలు చల్లుతూ ఆద్యంతం స్వాగతించారు. అడుగడుగునా ఆర్త జనుల కర్పూర హారతులిస్తూ భక్తి పారవశ్యంతో పులకించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొని, సందడి చేశారు. ఈ భక్తి యాత్ర తిరుపతి చరిత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రతిష్టాత్మకరంగా పరిగణిస్తూ… నిర్వహించ తలపెట్టిన కారణంగా ఈ గంగ జాతర మరింత వైభవాన్ని సంతరించుకుకుంది. జాతర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం, సారె సమర్పించడం ఇదే తొలి సారి కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement