తిరుపతి, ప్రభన్యూస్: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం వరద ఉదృతిలో నీట మునిగిన పాతకాల్వ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తక్షణ సాయం అందజేసి బాసటగా నిలిచారు. ఈ మేరకు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాతకాల్వ గ్రామంలోని ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను స్వయంగా అందజేశారు. వీటిలో 25 కిలోల బియ్యం, పామాయిల్, ఉర్లగడ్డ తదితర సరుకులను దాదాపు 500 కుటుంబాలకు అందించారు. గ్రామ ప్రజలు సైతం మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.
ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి నిత్యవసర సరుకులు అందించడం పట్ల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసమే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరంతరంగా పరితపిస్తున్నారని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. వరద బాధితులకు ఇంటికి సైతం వెళ్లకుండా ప్రజల రక్షణ కోసం నిద్రాహారాలు మాని కష్టపడ్డారని తెలియజేశారు. ఇటీవల పోలీసులతో వాగ్వివాదం జరిగిన సంఘటనలో గాయపడిన మహిళకు మోహిత్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆ మహిళా ధన్యవాదాలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital