దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి మరణంపై మాట్లాడాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తోందని చెప్పారు. ఆయన వివాద రహితుడని తెలిపారు. సహజంగా రాజకీయాల్లో ఎవరు ఎదిగినా వివాదాలు ఉంటాయి. కానీ గౌతమ్‌రెడ్డి వాటికి అతీతుడని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మంత్రిగా ఎదిగారని కొనియాడారు. సీఎంకి సన్నిహితంగా మెలిగారని చెప్పారు. ఈ ఏడాది జనవరి 3, 4 తేదీల్లో తాము కలుసుకున్నామని, జిల్లా అభివృద్ధి కోసం ఇద్దరం చర్చించుకున్నామని గుర్తు చేసుకున్నారు. వాటన్నింటిసీ సీఎం వద్ద ప్రస్తావిద్దామని ఆయన చెప్పారని అన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని గౌతమ్‌రెడ్డి ఎంతో ఆకాంక్షించారని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ కంపెనీల ఏర్పాటుపై దృష్టి పెట్టారన్న ఆనం.. ఆ పనులు పురోగతిలో ఉండగానే, గౌతమ్‌రెడ్డి ఈ లోకం వీడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వివాదరహితుడిగా ఉండే అతి తక్కువ మందిలో గౌతమ్‌రెడ్డి ఒకరుని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement