కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆ మధ్య జనసేనలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముద్రగడను.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. కానీ, ఏం జరిగిందో తెలియదు.. ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుడుగు పడలేదు.. ఆ తర్వాత ఈ పరిణామాలపై ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. అయితే, ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోయినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారట మిథున్ రెడ్డి.. ఇక, మీరు అడుగుతున్నారా? లేక సీఎం జగన్ అడగమన్నారా? అని మిథున్ రెడ్డిని ప్రశ్నించారట ముద్రగడ.. దీంతో.. సీఎం అడగమన్నారని మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా చెబుతున్నారు.