Friday, January 10, 2025

Tirupati Stampede | త‌ప్పు జ‌రిగింది.. క్షమించండి : డిప్యూటీ సీఎం వవన్

  • టీటీడీ పాలక మండలి బాధ్యత వహించాలి
  • మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి
  • పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం వవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో పొరపాటు జరిగిందని.. బాధ్యత తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. దీనికి చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా అని పవన్ అన్నారు.

ఈ ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈఓ, అడిషనల్ ఈఓ, చైర్మన్‌లపై ఉంది. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి వారిన ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పే బాధ్యత టీటీడీ పాలక మండలి తీసుకోవాలి అని అన్నారు.

టికెట్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యూ లైన్లో ఉన్న‌ భ‌క్తులను, ర‌ద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యార‌ని… పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి స్తాయి విచార‌ణ జ‌ర‌గాలి అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement