అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికలకు గడువు దగ్గర పడే కొద్దీ అధికారపక్షమైన వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గడపగడపకు పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. తాజాగా యువతపై వైసీపీ ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికల్లో అత్యధిక శాతం యువత వైసీపీకి అండగా నిల్చింది. ఫలితంగా 151 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సుమారు రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఇంజనీరింగ్ పట్టభద్రులకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా వైసీపీ ఐటీ విభాగం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల పొత్తుల నేపథ్యంలో యువతపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మిషన్ ఐటీ ఆర్మీ
వైసీపీ ఐటీ- విభాగం వినూత్నంగా లక్ష మంది ఐటీ- ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ ఐటీ- సైన్యాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించి మిషన్ ఐటీ- ఆర్మీని ఆ పార్టీ ఐటీ- విభాగ రాష్ట్ర అధ్యక్షులు పి. సునీల్‌కుమార్ రెడ్డి ఈనెల 3వ తేదీన ఆవిష్కరించారు. వైసీపీ ఐటీ విభాగం హైదరాబాద్‌లోని హై-టె-క్ సిటీ-లో ఐటీ- ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహించింది. ఈ సదసుకు హైదరాబాద్ జంటనగరాల్లోని వైసీపీ అభిమానులైన ఐటీ- ఉద్యోగులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐటీ- ప్రొఫెషనల్స్ భారీ ఎత్తన హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన శక్తిమంతమైన ఐటీ- సైన్యం ఉండాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా మిషన్ ఐటీ- ఆర్మీ పేరిట వైసీపీకి ఒక భారీ ఐటీ- ఆర్మీని ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ఐటీ- విభాగానికి 5 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయి. వీరిలో చురుకైన వారిని ఎంపిక చేసి లక్ష మందితో బలీయమైన ఐటీ- సైన్యాన్ని ఏర్పాటు- చేయాలన్నదే మిషన్ ఐటీ ఆర్మీ ప్రధాన ఉద్దేశ్యం. పార్టీ అభిమానులైన ఐటీ- నిపుణులు, ఉద్యోగులను ఈ సైన్యంలో చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ఆరంభించారు.
విస్తృత ప్రచారమే లక్ష్యం
వైసీపీ ఐటీ- సైన్యం అంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గ్రామీణ యువత, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో మమేకం కానున్నారు. వారి సాధకబాధలు తెలుసుకుని వారికి మంచి ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ విజయాలను, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను. సంక్షేమ కార్యక్రమ ఫలాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇప్పటికే బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ విభాగం సదస్సులకు మంచి స్పందన లభించింది. ఈ తరహా సదస్సులను దేశంలోని ముఖ్య పట్టణాల్లో నిర్వహించి ఆ ప్రాంతాల్లోని ఐటీ- ప్రొఫెషనల్స్‌తో అనుసంధానం కానున్నారు. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో ఐటీ సదస్సులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీకి, పార్టీ అభిమానులైన ఐటీ- ప్రొఫెషనల్స్‌కు మధ్య ఒక వారధిగా ఐటీ- వింగ్ వ్యవహరించనుంది. ఐటీ- ప్రొఫెషనల్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకించి దృష్టి సారించనుంది.
ఐటీ అభివృద్ధిపై ఫోక స్
ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పారిశ్రామిక, ఐటీ- అభివృద్ది ఊపందుకుంటున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఐటీ అభివృద్ధిలో ఏపీ వెనుకబడింది. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐటీ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖపట్నం ను ప్రఖ్యాత ఐటీ- కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోని పెద్ద పెద్ద నగరాలతోనే పోటీ-పడే విధంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్ రూపొందించింది. విశాఖలో అదాని లాంటి సంస్థ అతి పెద్ద డాటా కేంద్రాన్ని ఏర్పాటు- చేసి 50వేల ఉద్యోగాలు కల్పించబోతోంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఐటీ- విధానపత్రం ద్వారా రాబోయే మూడేళ్లలో మరో 50వేల ఉద్యోగాలు ఐటీ రంగంలో కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
\