Sunday, November 24, 2024

Missing ఎంపీడీవో అదృశ్యం – విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి : నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు..

ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్నవారి వివరాలను తక్షణమే అందించాలన్నారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎం.వెంకటరమణారావు.. కనిపించకుండా పోయారంటూ.. ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీవో వెంకటరమణారావు దంపతులు నివాసం ఉంటుండగా.. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు ఎంపీడీవో..

ఇక, సోమవారం ఉదయం మచిలీపట్నం వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయిన ఆయన ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా సూసైడ్ నోట్ రావడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేశారు..

- Advertisement -

మాజీ విప్ ప్రసాద రాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయలు బకాయి కట్టమంటే.. బెదరిస్తున్నాడని.. అందుకే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్నారు వెంకటరమణ.. దీంతో, రాత్రి నుంచి ఏలూరు కాల్వలో వెంకటరమణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..

ఎంపీడీవో మిస్సింగ్‌ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆయన మొబైల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు ఉన్నట్టుగా గుర్తించారు.. ఇక, మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు పక్కనే ఉన్న ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు గుర్తించారు.. దీంతో, ఏలూరు కాల్వలోకి దూకి ఎంపీడీవో సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement