Friday, November 22, 2024

Missing Cases – తెలుగు రాష్ట్రాల‌లో 15వేల మంది బాలిక‌లు, 57 వేల‌మంది మ‌హిళ‌లు మిస్సింగ్ – వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ – తెలుగు రాష్ట్రాలలో గ‌త మూడేళ్ల‌లో మొత్తం 15వేల‌మంది బాలిక‌లు, 57వేల‌మంది మ‌హిళ‌ల‌ను మిస్సింగ్ అయ్యారు.. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ గ‌ణాంకాల‌ను విడుద‌ల చేసింది.. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2021 వరకు 7028 మంది బాలికలు, 22,278 మహిళలు మిస్సింగ్ అయినట్లు పేర్కొంది. అలాగే, తెలంగాణలో 8066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్ల‌డించింది..

కేంద్ర హోం శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాలు
18 ఏళ్ల లోపు బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి వివరాలు
2019 నుండి 2021 వరకు మూడు ఏళ్లలో ఏపీ లో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు మిస్సింగ్
2019లో ఏపీ నుండి 2186 బాలికలు 6252 మహిళల మిస్సింగ్ కేసులు
2020 లో ఏపీ నుండి 2374 బాలికలు 7057 మంది మహిళల మిస్సింగ్ కేసులు
2021 లో ఏపీ నుండి 3358 బాలికలు 8969 మంది మహిళల మిస్సింగ్ కేసులు

ఇక తెలంగాణ‌లో 2019 నుండి 2021 వరకు మూడు ఏళ్లలో మొత్తం 8066 మంది బాలికలు, 34495 మహిళలు మిస్సింగ్
2019 లో తెలంగాణ నుండి 2849 మంది బాలికలు 10744 మహిళల మిస్సింగ్ కేసులు నమోదు
2020 లో తెలంగాణ లో 2232 మంది బాలికలు 10917 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు
2021 లో తెలంగాణ లో 2994 మంది బాలికలు 12834 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement