ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలో పాత రథచక్రాలకు ఈ రోజు కొంతమంది ఆగంతకులు నిప్పు పెట్టారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. దీనిపైతీవ్ర అసహనం వ్యక్తం దేవాలయ నిర్వాహకులు. 11వ శతాబ్దానికి చెందిన గణపతి దేవాలయం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాగా, స్వామివారి పాత రథ చక్రాలు ఇతర స్క్రాప్ వస్తువులతో ఆలయానికి అర కిలోమీటరు దూరంలో ఉంచారు. వీటిని కాలిపోయినట్లు గుర్తించారు. ఆలయ భద్రతా సిబ్బంది గుడి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగులను గుర్తించారు.
అయితే దీనిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డిపిఓ) తెలిపారు. ఆలయ రథాలకు సంబంధించిన అన్ని వస్తువులను షెడ్లలో భద్రపరిచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) తెలిపారు. “15 సంవత్సరాల క్రితం తొలగించబడిన రథ చక్రాలను ఆలయానికి అర కిలోమీటరు దూరంలో ఉంచారు. వాటిని బహిరంగ ప్రదేశంలో ఉంచారు. వాటి ప్రాశస్యం తెలియక స్కావెంజర్లుకాల్చారు”అని టెంపుల్ ఈవో చెప్పారు. అసలు రథం సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు.