Tuesday, November 26, 2024

Miracle – కుడివైపు గుండె – అవాక్కైన డాక్టర్లు

కాకినాడ – సాధారణంగా అందరికీ గుండె ఛాతి భాగానికి ఎడమ వైపు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తాళ్ళరేవుకు చెందిన శ్రీనివాస్‌కు కుడివైపున గుండె ఉంది. గుండె ఎడమవైపు కాకుండా కుడివైపు ఉండటంతో అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా వైరల్ అయింది. సదరు వ్యక్తి శ్రీనివాస్ గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడ నగరంలోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా.. అక్కడి డాక్టర్లు శ్రీనివాస్‌కు ఎక్స్‌రే తీసి.. గుండె ఎడమవైపు ఉండాల్సిన బదులు కుడివైపు ఉందని గుర్తించి అవాక్కయ్యారు.

గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు రెండు చోట్ల బ్లాక్‌లు ఏర్పడటంతో వైద్యులు అతడికి అరుదైన హార్ట్ సర్జరీ నిర్వహించారు. రెండు చోట్ల రక్తనాళాల బ్లాకులను చేతి నుంచి క్లియర్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా రెండు స్టంట్స్ వేసి ఆపరేషన్‌ సక్సెస్ చేశారు డాక్టర్లు. ఈ అరుదైన సమస్య ప్రతీ 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని వైద్యులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement