మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని పరిశీలించి అప్పిళ్లకు వెళ్తామని ఆయన వెల్లడించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని భావించడం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం మూడు ప్రాంతాలు, 13 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏది మంచి జరుగుతుందో అదే విధంగా ముందుకు వెళ్తుతుందని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement