పక్క రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. అయితే, తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీని అనలేదు..లోకేష్ కావాలనే వక్రీకరించారని మంత్రి రోజా ఆరోపించారు. కేటీఆర్ ప్రక్క రాష్ట్రాలు అన్నారు గాని, ఆంధ్రప్రదేశ్ అని అనలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలను కావాలనే టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న బురదజల్లుడు కార్యక్రమాలన్నింటి వెనుక టీడీపీ వుందని రోజా ఆరోపించారు.
ROJA: కేటీఆర్ అన్నది ఏపీని కాదు.. లోకేష్ వక్రీకరించారన్న మంత్రి రోజా
Advertisement
తాజా వార్తలు
Advertisement