నగరి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పంగుణోత్తర కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం కరకంఠేశ్వర స్వామిని రథంపై ఊరేగించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ఈ ఉత్సవాల్లో పాల్గొని కామాక్షీ కరకంఠేశ్వరులను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆమెను ఆహ్వానించారు. హరహర నామ స్మరణల నడుమ ఆమె రథాన్ని ముందుకు లాగి రథోత్సవ వేడుకలను ప్రారంభించారు. మాడ వీధుల గుండా సాగిన ఊరేగింపులో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఆమెతో పాటు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement