Friday, November 22, 2024

దేశమ్మతల్లి ఆలయానికి మంత్రి రోజా భూమి పూజ..

చిత్తూరు జిల్లా నగిరిలో దేశమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా భూమి పూజ నిర్వహించారు. నగిరి గ్రామ దేవతగా ప్రసిద్ధిగాంచిన దేశమ్మ తల్లి చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణం చాలా రోజుల ప్రజల కోరిక. దీంతో మంత్రి ఆర్.కె.రోజా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించి భూమి పూజ చేశారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో తల్లి మొక్కులు తీర్చుకుంటారు. తల్లి అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని అక్కడి స్థానికుల నమ్మకం. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం, వైఎస్సార్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement