తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై మాటల యుద్దం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం, దివంగత మాజీ సీఎం వైఎస్ పై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా మేం అదనంగా తీసుకోవడం లేదన్నారు. శ్రీశైలం, సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని తెలిపారు. కృష్ణా జలాల వినియోగంపై సందేహాలుంటే చర్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని.. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సూచించారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే సీఎం జగన్ విధానం అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైఎస్ నరరూప రాక్షసుడు.. ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్