Tuesday, November 26, 2024

సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహo వ్యక్తం చేశారు. ‘నేనే అందర్నీ నామినేషన్ చేసి గెలిపించడం వల్ల ఎవరికి పదవుల విలువ తెలియడం లేదు.  మీరు డబ్బులు ఖర్చుపెట్టి గెలిచుంటే.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే ఉంటే  విలువ తెలిసేది. మీరు ఇంట్లో కూర్చొవుంటే నేను మీకు మున్సిపల్ చైర్మన్ , మండల ప్రెసిడెంట్ ,సర్పంచు లను ఖర్చులేకుండా గెలిపించాను’ అని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయని మంత్రిపెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: గడ్చిరోలిలో కాల్పుల మోత.. 13 మంది మావోయిస్టులు హతం

Advertisement

తాజా వార్తలు

Advertisement