ఏపీలో మూడు రాజధానుల అంశం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టు ఆశ్రయించారు. ఈనేపథ్యంలో మూడు రాజధానుల బిల్లను ఉపసంహరించుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని ఆయన అన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేశామన్న మంత్రి పెద్దిరెడ్డి.. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా? అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్రగా అభివర్ణించారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..