Sunday, November 3, 2024

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకాలు చేస్తే, చూస్తూ సహించాలా ? అని ప్రశ్నించారు. తనను చంద్రబాబునాయుడు హెచ్చరించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి చిత్తూరు జిల్లాలో టీడీపీ మెజార్టీ సాధించలేదని గుర్తు చేశారు. ఈ సారి కుప్పంలోనూ చంద్రబాబు జెండాను పీకేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగా ను చంపించింది చంద్రబాబు కాదా ? అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement