Sunday, December 1, 2024

AP Assembly : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉందన్న ఆయన.. ఈసారి రాష్ట్రాన్ని కాపాడేందుకు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు.

గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు. అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి.. అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement