Wednesday, December 25, 2024

Delhi | హడ్కో సీఈవోతో మంత్రి నారాయణ భేటీ..

మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మంగళవారం హస్తిన పర్యటనలో హడ్కో సీఈవో సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ, జిందాల్‌ సా చైర్మన్‌ పీఆర్‌ జిందాల్‌తో భేటీ అయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో చైర్మన్‌తో చర్చించారు. ఇప్పటికే రాజధాని కోసం రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది.

రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుపై పృథ్వీరాజ్‌ జిందాల్‌తో చర్చించారు. ఇప్పటికే గుంటూరు, విశాఖలో రెండు ప్లాంట్‌ లను జిందాల్‌ సంస్థ ఏర్పాటు చేసింది. మరిన్ని ప్లాంట్‌ లు ఏర్పాటుపై జిందాల్‌ తో మంత్రి నారాయణ చర్చలు జరిపినట్లుగా వెల్లడించారు. అనంతరం ఆయన తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement