ఈనెల 10వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ రానున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ రా.9 గం.లకు అనతరపురం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి రా.11 గం.లకు కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం చేరుకొని బస చేస్తారు.
ఉ.9గం.లకు రోడ్డు మార్గాన బయలుదేరి నగరంలోని పలు కళాశాలలను పరిశీలిస్తారు. మ.12 గం.ల నుండి మ.1 గం.ల వరకు ఎస్ఏపీ గ్రౌండ్స్ చేరుకొని రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మ.1 గం.లకు ఎస్ఏపీ గ్రౌండ్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మ.1:30 గం.లకు కర్నూలు విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్తారు.
- Advertisement -