Sunday, November 10, 2024

Review Meeting – సివిల్ స‌ప్లై అధికారుల‌పై మంత్రి నాదెండ్ల ఆగ్ర‌హం….

పిడిఎస్ రైస్ అక్ర‌మ రవాణా
అధికారులు ఏం చేస్తున్నారంటూ నిల‌దీత‌
రేష‌న్ స‌క్ర‌మంగా పంపిణీ కావ‌డం లేదంటూ క్లాస్

పిడిఎస్ రైస్ అక్ర‌మంగా ర‌వాణా జ‌రుగుతున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటూ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌శ్నించారు.. గత పది రోజులుగా పీడీఎస్ రైస్ ఎక్కువ మూమెంట్ అవుతుందని అంటూ ఎందుకు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదని నిల‌దీశారు. కాకినాడలో ఆయ‌న నేడు త‌న శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.. అక్ర‌మ ర‌వాణ అరిక‌ట్టేందుకు వెంట‌నే జేసీ రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు. రేషన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్న ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ తో సంబంధం ఏమి ఉందని ప్రశ్నించారు.. ఎన్నికలు ముగిసిన అధికారులు స్లీప్ మోడ్ లో ఉంటున్నార‌ని స‌మాధానం చెప్ప‌డంతో అదేం సమాధానం అంటూ జెసీపై ఫైర్ అయ్యారు. ఇక . కొత్త రేషన్ కార్డులు కోసం డేటా తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు..

- Advertisement -

కౌలు రైతుల విషయంలో విపక్ష చూపించారంటూ.. చట్టంలో మార్పు తీసుకుని వస్తామన్నారు మంత్రి.. వ్యవస్ధాపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిల్లెట్స్ పంటలు ను ఎంకరేజ్ చేస్తామ‌న్నారు. రేష‌న్ స‌రుకులు అంగన్ వాడీలు, రెసిడెన్షియల్ హాస్టల్ లలో క‌నిపిస్తున్నాయ‌ని, దీనిపై గత మూడు నెలల్లో ఎక్కడ కేసులు పెట్టకపోవడం ఏమిట‌ని అధికారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు నాదేండ్ల‌. అసలు హాస్టల్స్ లో ఎందుకు త‌నిఖీలు చేయ‌డం లేద‌ని సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement