Tuesday, November 19, 2024

సరికొత్త టెక్నాలజీతో చరిత్ర.. చౌకగా మంచి నీటి సరఫరా

సరికొత్త టెక్నాలజీతో మెట్టప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సురక్షిత మంచినీటిని చౌకగా సరఫరా చేసే దిశగా మంత్రి మేకపాటి అడుగులు వేస్తున్నారు. అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆర్వో ప్లాంట్ ను అక్టోబర్ 30న ఆత్మకూరులో ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గంలోని ఆత్మకూరులో శుద్ధి చేసిన నీటిని కోరుకున్నవారి ఇంటికే నేరుగా సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు కానున్న ఆర్వో వాటర్ డైరెక్ట్ టు హోమ్ కార్యక్రమం ఆత్మకూరులో ప్రారంభించిన అనంతరం నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. పెన్నా నది నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా నీటిని ఆర్వో ప్లాంట్ వద్దకు తీసుకువచ్చి అక్కడ ప్యూరిఫై చేసి.. పట్టణ ప్రజలు కోరుకున్న ఇంటికి ఈ పైపులు అమరుస్తారు. ముందుగానే డబ్బు చెల్లించి నీటిని పొందే ఈ ప్రాజెక్టులో 20 లీటర్ల నీటిని కేవలం రూ.5 అందించనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. సెల్ ఫోన్ రీఛార్జ్ తరహాలో ముందుగా డబ్బు చెల్లించడం (ప్రీ పెయిడ్ కార్డు) నీటిని పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement