హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నేడు నెల్లూరుకు తరలించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన భౌతికకాయం తరలిస్తారు. ఉదయం 11 గంటలకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకోనుంది.
నెల్లూరులో అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఈరోజు రాత్రి అమెరికా నుంచి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రానున్నారు. రేపు(బుధవారం) ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు.
కాగా, మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. గౌతంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు హైదరాబాద్ కు వచ్చి మరామర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు.