ఏపీలో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టింది చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ టీడీపీ సభ్యులు ఆందోళనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చీప్ లిక్కర్ ని కనిపెట్టింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. ‘జే బ్రాండ్స్’ అంటున్నారు వాటికి బాబే లైసెన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. 240 బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు అల్జీమార్స్ తో బాధపడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్ షాపులను రద్దు చేశారని తెలిపారు. చంద్రబాబు దిగిపోతూ బార్లకు 5 ఏళ్ల పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. సస్పెండ్ కాని సభ్యులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
చీప్‌లిక్కర్ కనిపెట్టింది చంద్రబాబే.. ‘జే బ్రాండ్స్’కి ఆయనే లైసెన్స్ ఇచ్చారన్న మంత్రి కొడాలి
Advertisement
తాజా వార్తలు
Advertisement