Saturday, September 21, 2024

నక్కల కాలువను అభివృద్ధి చేసేది మేమే – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ముత్తుకూరు సెప్టెంబర్ 15( ప్రభ న్యూస్) సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి నక్కల కాలువను వరదలు సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూపించారని ఏమైనా పనులు చేశారా అంటూ ప్రయోజనం ఉందా అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం పొట్టెంపాడు గ్రామపంచాయతీ పరిధిలో మంత్రి పర్యటించారు. అక్కడ జరుగుతున్న నక్కల కాలువ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణు వర్ధన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతుల విజ్ఞప్తి మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన అర్జీల నిమిత్తం నక్కల కాలువను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించి నక్కల కాలువను చూసి అభివృద్ధి పనులు చేయలేకపోయారని ఇప్పుడు విమర్శిస్తున్న నాయకులు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోకపోగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాలువపై దృష్టి పెట్టి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని మంత్రి పేర్కొన్నారు.

.అదేవిధంగా తిరుమలమ్మ పాలెం, నక్కల కాలువ వంతెన నిర్మాణ పనులు కూడా 22కోట్లతోనిర్మాణం చేసే విధంగా టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం నాయకులకు లేదని వారు చేయలేని పనులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి నక్కల కాలువ అభివృద్ధి పనులు చేయడం ఏమాత్రం ఇష్టం లేదని న్యాయస్థానం వెళ్లి కేసులు వేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఎక్కడ పరువు చేస్తారన్న ఉద్దేశంతో మౌనం వహించారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండటం వల్ల నక్కల కాలవ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు లెక్కేసుకునేందుకు కౌంటింగ్ మిషన్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారని మంత్రి విమర్శించారు.

నక్కల కాలువ మేజర్ డ్రైయిన్ అభివృద్ధి పనులకు భూమి పూజ.

నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ నక్కల కాలువ డ్రైయిన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భూమిపూజ చేశారు. మీడియా సమావేశం ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎఫ్ డి ఆర్ నిధులు 430.46 లక్షల రూపాయలతో ఐదుపనులు నిర్వహించేందుకు శంకుస్థాపన చేయడం జరిగింది..

- Advertisement -

మండల పార్టీ కన్వీనర్ మెట్టాతో పాటు స్థానిక మాజీ సర్పంచ్ పల్లం రెడ్డి జనార్దన్ రెడ్డి, ఎంపీపీ సుగుణ, జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ జమీల్, బ్రహ్మ దేవం ఆలయ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, వైసిపి సర్పంచులు అన్నా బత్తిన కృష్ణవేణి, పల్లికొండ పెంచల ప్రతాప్ ముదిరాజ్, మునుకూరు జనార్దన్ రెడ్డి, ఆళపాక శ్రీనివాసులు, పార్టీ సీనియర్ మునుకూరు రవికుమార్ రెడ్డి,ఈదూరు రామ్మోహన్ రెడ్డి, దువ్వూరు కోదండరామిరెడ్డి, మాజీ సర్పంచ్ మోడెం రామచంద్రారెడ్డి, పంట సాయికుమార్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పోచారెడ్డి చెంగారెడ్డి, కృష్ణపట్నం, తాళ్లపూడి ఉపసర్పంచ్లు రాగాల వెంకటేశ్వర్లు, గోపాల్, కృష్ణపట్నం ఆలయాల చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ (అగ్ని) వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వేద మంత్రాల మధ్య అట్టహాసంగా మంత్రి ఈ పనులకు భూమి పూజ చేశారు. అన్ని మండలాల రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నక్కల కాలువ అభివృద్ధి పనులు కు శంకుస్థాపన చేసిన సందర్భంగా రైతులు మంత్రి కాకాణికి కృతజ్ఞతలు తెలిపినారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను విస్మరించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నక్కల కాలువ అభివృద్ధి పనులు జరగడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రికి రైతులు చెప్పారు. రైతు సంక్షేమమే అజెండాగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల రైతులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామస్తులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement