ముత్తుకూరు, ప్రభ న్యూస్: ఆసియా ఖండంలో అతిపెద్ద ఓడరేవు అయిన అదాని కృష్ణపట్నం పోర్టుపై వివాదం చెలరేగింది. కృష్ణపట్నం ఓడరేవు మూతపడిందని అఖిలపక్ష పార్టీలు ఆరోపించగా.. కంటైనర్ టెర్మినల్ మూతపడలేదని రుజువు చేస్తూ ఓడరేవు యాజమాన్యం 2800 కంటైనర్లతో ఉన్న నౌకను శుక్రవారం కృష్ణపట్నం ఓడరేవుకు తీసుకువచ్చింది.
ఇటీవల అధికార పార్టీ, అఖిలపక్ష పార్టీల మధ్య కంటైనర్ టెర్మినల్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం దొరికింది. కృష్ణపట్నం పోర్టు అధికారుల సమాచారం మేరకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడరేవుకు చేరుకుని కంటైనర్ల నౌకను సందర్శించారు. మీడియాకు వాస్తవ విషయాలు తెలియజేశారు. పోర్టు ఉన్నతాధికారులు కంటైనర్ల నౌక గురించి మంత్రికి సమగ్రంగా నివేదిక ఇచ్చారు. అఖిలపక్ష పార్టీలు కృష్ణపట్నం పోర్టుపై రాజకీయాలు చేశాయని మంత్రి కాకాణి అన్నారు.