నూతనంగా ఏర్పాటవుతున్న నంద్యాలలో జిల్లా కార్యాలయాల భవనాలను తనిఖీ చేసి ఆర్ అండ్ బి ఎస్ఈకి పలు ఆదేశాలు జారీ చేసారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తొలుత నంద్యాల డిఎస్పి కార్యాలయం, సబ్ కలెక్టర్ బంగ్లా, ఆర్డిఓ కార్యాలయ ఓల్డ్ బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం, బిఎస్ఎన్ఎల్ రెసిడెన్షియల్ క్వాటర్స్,ఆర్ఎఆర్ఎస్ లో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ హాలు తదితర భవనాలు మంత్రి తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని కార్యాలయాలు డీప్ క్లీనింగ్ చేయించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తచెదారాన్ని తొలగించి మొక్కలు నాటి ప్లాంటేషన్ అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యాలయంలోని బల్లలు, ఫర్నీచర్ బ్రాండెడ్ క్యాంపెనీకి చెందినవే కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెంట జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఈషాక్ బాషా తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement