Saturday, November 23, 2024

రాజధానిగా విశాఖ నుంచే పాలన: బొత్స

మూడు రాజధానుల అంశానికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడే రాజధానిగా విశాఖ ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేశారు. దుష్ట శక్తులు న్యాయస్థానాలకు వెళ్లి ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. న్యాయప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరలోనే అన్ని అడ్డంకులు దాటుకుని పరిపాలన రాజధానిగా విశాఖ నుంచి పాలన సాగనుందని చెప్పారు. కోవిడ్ తర్వాత సమావేశాలు ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. సీఎం ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదని ఆయన అన్నారు. రాష్ట్రానికి నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా.. విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని బొత్స తెలిపారు. వ్యాక్సిన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రూ.785 కోట్లు: బీజేపీకి బడా కంపెనీల భారీ విరాళాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement