Friday, November 22, 2024

Vijayanagaram: టీడీపీ నేతలకు మంత్రి బొత్స సవాల్

తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… తమ మేనిఫెస్టోలో ఇచ్చిందే తాము అమలు చేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఇక్కడకు వచ్చి మైకులు పట్టుకుని డబ్బాలు కొడుతున్నారని మండిపడ్డారు. ఏవీ అమలు కాలేదని ఆ నాయకులు చెబుతున్నారు.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రమ్మనండి.. అంటూ సవాల్‌ చేశారు.. ఆ పెద్ద నాయకులను మేనిఫెస్టో పట్టుకొని డిబెట్‌కు రమ్మనండి అంటూ చాలెంజ్‌ చేశారు మంత్రి బొత్స.. ఇక, 2014-19లో మీరు ఏం చేశారో.. ఇప్పుడు మేం ఏం చేశామో ప్రజలు చూస్తారని హితవు పలికారు.. బాధ్యతగా మాట్లాడాలి.. ఆదర్శంగా ఉండాలని సలహా ఇచ్చారు.

వ్యక్తిగతంగా తాము మాట్లాడటం లేదన్నారు. వ్యవస్థ పరంగానే మాట్లాడుతామని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. మరోవైపు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, అమిత్ షాతో సమావేశమైన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం జోరందుకుంది.. దీనిపై స్పందించిన మంత్రి బొత్స.. ముందస్తు ఎన్నికలు, పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే ఉండదని.. మార్చిలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement