Thursday, November 28, 2024

TTD | శ్రీవారి స‌న్నిధిలో మంత్రి ఆనం

తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ…. తిరుమలలో ఎలాంటి వివాదం లేకుండా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రసాదాల తయారీ ఉన్నతంగా, నాణ్యతగా ఉన్నాయన్నారు. పాలకమండలి చాలాబాగా పనిచేస్తుందని భక్తులు కొనియాడుతున్నారని తెలిపారు. గతంలో కంప్లైంట్ బుక్ లేదని… ప్రస్తుత పాలకమండలి కంప్లైంట్ బుక్ తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నైవేద్య సమర్పణలో కూడా ఎలాంటి తప్పిదాలు జరుగకుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నాలుగు మాసాల్లోనే చాలా మార్పు వచ్చిందన్నారు. భవిష్యత్ లో ప్రతి మాసం తిరుమలకు వచ్చి సౌకర్యాలను పర్యవేక్షిస్తామని తెలియజేశారు. దూపదీప నైవేద్య కార్యక్రమాన్ని 10వేల రూపాయలకు పెంచి అన్ని ఆలయాలకు ఇవ్వ‌నున్నామన్నారు. మొదటి విడతలో 5400 ఆలయాలను రెన్యువల్ చేశామని చెప్పిన ఆయన….కొత్త ఆలయాలకు సైతం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటూ వస్తున్నామన్నారు.

- Advertisement -

స్క్రూట్నీ పూర్తయ్యాక ఇతర ఆల‌యాలకు దూపదీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. తిరుమల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికే మఠాలకు తిరుమలలో స్థలాలు కేటాయింపు చేసినట్లు చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో ఈ అంశాన్ని పట్టించుకునే వారే లేకపోయారని… కొత్త పాలకమండలి ఈ పీఠాలు, మఠాలపై దృష్టి పెట్టారని, వ్యాపార ధోరణిలో పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement