Saturday, November 23, 2024

రేపు కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయనున్న మంత్రి అంబటి రాంబాబు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఖరీఫ్‌ సీజన్‌ లో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 10న శుక్రవారం ఉదయం 11.42 గంటలకు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రెండు వారాల ముందే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఇటీ వలనే ఈనెల 1న గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి రాంబాబు శుక్రవారం కృష్ణా డెల్టాతో పాటు గుంటూరు చానల్‌ కు నీరు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్‌, చిత్రావతి, వెలిగల్లు ఆయకట్టు-కు కూడా ఈనెల 10 నుంచి నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నాగార్జున సాగర్‌ ఆయకట్టు-కూ, 30 నుంచి శ్రీశైలం కుడిగట్టు- కాల్వ ఆయకట్టు-కు సాగునీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement