Friday, November 22, 2024

ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు లేనట్లే! మంత్రి కీలక వ్యాఖ్య

ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై వివాదం కొన‌సాగుతుంది. పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం… కరోనా నేపథ్యంలో రద్దు చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఈ అంశంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదన్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించామ‌న్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్ర‌మే పరీక్షలు నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నారా లోకేష్ లాగా అందరూ దొడ్డి దారిలో మంత్రి పదవులు పొందలేరని ఆదిమూల‌పు సురేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ లాగా అందరికి హెరిటేజ్ లాంటి ఆస్తులు లేవని.. ఎవరో సీటు ఇప్పిస్తే ఆయ‌న‌ స్టాన్‌ఫోర్డ్‌లో చదివారన్నారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమషం పట్టదని.. కానీ తాము విద్యార్థులు భవిష్య‌త్ గురించి ఆలోచిస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement