ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆగస్టు 15 లోగానే ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈఏపీ సెట్ ఫలితాలు ఆగస్టు 15 తర్వాత విడుదలకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 లోగానే ఇంటర్ ఫలితాలను కూడా వెల్లడిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో వారంలో తరగతులు ప్రారంభానికి యోచిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవు అని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
Flash: ఇంటర్ కంటే ముందే టెన్త్ పరీక్షలు.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..
Advertisement
తాజా వార్తలు
Advertisement