తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి.. రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కాన్నా 3 డిగ్రీల వరకు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆదిలాబాద్ జిల్లా 13.6గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బజార్ హత్నూర్ లో 14 డిగ్రీలు, కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 14.1 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, విశాఖ ఏజెన్సీలో 12 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..