Saturday, November 23, 2024

రేషన్‌ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు..

ప్ర‌భ‌న్యూస్ : రేషన్‌ దుకాణాల ద్వారా మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, ఎన్‌. రెడ్డెప్ప విడివిడిగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. రేషన్‌ దుకాల్లో కేవలం ఆహారధాన్యాలు మాత్రమే కాకుండా ఇతర నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు అందించే ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో మినీ ఎల్పీజీ సిలిండర్ల ప్రతిపాదనలు వచ్చాయని, ఆ మేరకు తాము ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చర్చించి, మినీ ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అయితే రేషన్‌ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, అందుకే ఆసక్తి కలిగిన రాష్ట్రాలు రేషన్‌ దుకాణాల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లను అందించవచ్చని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement