జి.కొండూరు : మైలవరంలో రెవిన్యూ డివిజన్ కోసం మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ అసెంబ్లీలో తన గళం వినిపించారు. గురువారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరువూరు కేంద్రంగా ఏర్పాటు అయ్యే రెవెన్యూ డివిజన్లో కలపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. తిరువూరు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమని పేర్కొన్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న జి.కొండూరు, మైలవరం మండలాల ప్రజలందరికీ తిరువూరుకు వెళ్ళటం ఇబ్బందికరమైన విషయం అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మైలవరం కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సంబంధిత అధికారులందరికీ వినతి పత్రాలు అందజేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. అనివార్య కారణాల రీత్యా మైలవరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయని పక్షంలో మైలవరం, జి.కొండూరు మండలాలను విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తిరువూరు పట్టణం ఈ రెండు మండలాలకు చాలా దూరంగా ఉంటుదన్నారు. తిరువూరు పట్టణం ఏపీ – తెలంగాణ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతం అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మైలవరం నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో సభా ముఖంగా తెలియజేశారు.
మైలవరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి..అసెంబ్లీలో గళం వినిపించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
Advertisement
తాజా వార్తలు
Advertisement