Friday, November 22, 2024

25 నుంచి మిలాన్ మెరుపులు.. రెండు భారీ నౌకల విన్యాసాలకు సన్నాహాలు

విశ్వనగరంగా పేరుగాంచిన విశాఖ మరోసారి రెండు అంతర్జాతీయ నావికా విన్యాసాలకు వేదిక కాబోతుంది. ఇప్పటికే 2016లో అంతర్జాతీయ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌రివ్యూకి ఆతిధ్యమిచ్చిన విశాఖ మరోసారి ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూతో పాటు మిలాన్‌ విన్యాసాలకు ఆతిధ్యమిస్తుంది. ఈనెల 21న ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్‌-2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పటంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

ప్లీట్‌ రివ్యూ ఎందుకంటే..

1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడిచేసి విజయప తాక ఎగురవేసిన చరిత్ర తూర్పు నావికాదళానిది. అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ఈఎన్‌సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ప్రధాన విన్యాసాలకు కేంద్రంగా.. అంతర్జాతీయ ప్లీnట్‌ రివ్యూలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. 2006లో మొదటిసారిగా ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూ నిర్వహించి సత్తాచాటిన విశాఖ నగరం.. 2016లో అంతర్జాతీయ ప్లీnట్‌ రివ్యూతో ప్రపంచమంతా నగరం వైపు చూసేలా కీర్తి గడించింది. ఇప్పుడు రెండో పీఎఫ్‌ఆర్‌తో మొట్ట మొదటిసారిగా మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలిచే మిలాన్‌-2022కి ముస్తాబవుతోంది.

27న ఇంటర్నేషనల్‌ సిటీ- పరేడ్‌..

మరోవైపు.. 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా మిలాన్‌ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీ-టైమ్‌ సెమి నార్‌ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్‌ జయశంకర్‌ హాజరవుతారు. 27 సా.4.45కు విశాఖ బీచ్‌రోడ్డులో జరిగే ఆప రేషనల్‌ డిమాన్‌స్ట్రేష్రన్‌, ఇంట ర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖని సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

- Advertisement -

తిలకించేందుకు ఏర్పాట్లు..

25 వీడియో సిస్టమ్‌లు, బీచ్‌రోడ్‌లో 3 కిమీ మేర 40 ఎల్‌ఈడీ స్కీన్ర్‌లు, బీచ్‌ రోడ్డులో
జరిగే కార్యక్రమాలు: గరగల డ్యాన్స్‌, కూచిపూడి నృత్యాలు తదితర సంప్రదాయ నృత్యాలు,
స్టాల్స్‌: ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరుతో పాటు- 13 జిల్లాల్లోని ప్రసిద్ధమైన వస్త్రాల స్టాల్స్‌,
విదేశీ అతిథులకు తెలుగు రుచులు: ఆంధ్ర పిండి వంటలు, రాయలసీమ రుచులు, కృష్ణా గుంటూరు వంటకాలు. మాడుగుల హల్వా , నాటుకోడి కూర, గుత్తివంకాయ, రాయలసీమ రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల వేపుడు, కాకినాడ కాజాలు, బొంగు బిర్యానీ మొదలైనవి.
విదేశీయులకు ఇచ్చే బహుమతులు: ఏటికొప్పాక బొమ్మలు, రాజమండ్రి రత్నం పెన్నులు, ఇతర కళాఖండాలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement