Tuesday, November 26, 2024

Nude CAlls: అమ్మాయిల‌ నుంచి మిడ్‌నైట్ న్యూడ్‌కాల్స్‌.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే!

చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. అయితే అది మంచి, చెడు రెండు ర‌కాలుగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి ఘ‌ట‌నే ఓ యువ‌కుడికి ఎదుర‌య్యింది. అర్ధ‌రాత్రి ఓ గుర్తు తెలియ‌ని అమ్మాయి నుంచి వీడియో కాల్ వ‌చ్చింది. అదెంటో చూద్దామ‌నుకుని కాల్ లిఫ్ట్ చేశాడా యువ‌కుడి.. అంత‌లోనే అవ‌త‌లి వైపు నుంచి కాల్ చేసిన అమ్మాయి త‌న దుస్తుల‌ను ఒక్కొక్క‌టిగా తీసేస్తూ మాట్లాడుతోంది. ఆ త‌ర్వాత ఏమైందంటే..

– డిజిట‌ల్ మీడియా, ఆంధ్ర‌ప్ర‌భ‌

అమ్మాయి నుంచి కాల్.. అందులోనూ మిడ్‌నైట్‌ వీడియో కాల్.. ఇంకేముంది మాంచి ఆవేశంలో ఉన‌న ఆ కుర్రాడు కూడా టెంప్టు అయ్యాడు. ఇక్క‌డ సీన్ కట్ చేస్తే.. ఏదో జ‌రుగుతుంది అనుకుని టెంప్ట్ అయిన కుర్రాడు కాస్తా ఇస్పుడు ప్లీజ్ స‌ర్‌.. జ‌ర నన్ను మీరే కాపాడాలే అంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. జరగాల్సిందంతా జరిగిపోయాక ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. కర్నూలు జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేస్తోంది. ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆదుకుందామ‌నుకునే వారికి ఇది చెంప‌పెట్టు లాంటిద‌నే చెప్పుకోవాలి.

క‌ర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హాని ట్రాప్ వెలుగులోకి వచ్చింది. టౌన్‌లో ఉంటున్న సునీల్ అనే యువకుడికి అర్ధ‌రాత్రి వేళ‌ ఓ నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన అత‌ను ఒక్కసారిగా అవక్కాయ్యాడు. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన డ్రెస్ తీసేస్తూ కాల్ మాట్లాడుతోంది. వెంటనే సునీల్ కాల్ కట్ చేసాడు. ఇక‌.. కాల్ లిఫ్ట్ చేయడమే అతని కొంప ముంచింది. మాట్లాడిన కొద్దిసేపు కాల్‌ను కూడా రికార్డ్ చేశారు అవతలి వ్యక్తులు.

ఇక‌.. సునీల్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియో క్రియేట్ చేశారు. దానిని మళ్లీ సునీల్‌కే పంపించారు. ఆ వీడియోను చూసిన అత‌ని మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వీడియో పంపిన మహిళ నుంచి మరో మెసేజ్ వచ్చింది. డబ్బులు కావాల‌ని డిమాండ్ చేసింది. లేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేస్తాన‌ని బెదిరించింది. సునీల్ ఫ్రెండ్స్‌కు కూడా పంపుతానని చెప్పింది.

- Advertisement -

అయితే, సునీల్ తన వద్ద డబ్బులు లేవని, వీడియో ఎవరికీ పంపొద్దని వేడుకున్నాడు. అయినా విన‌లేదు. సునీల్ ద‌గ్గ‌రి ఫ్రెండ్స్ అయిన ఇద్ద‌రికి ఆ వీడియోను షేర్ చేశారు. దాంతో తన పరువు పోతుందని భయపడి ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోయాడు. ఇంత‌లో.. మరో నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది సునీల్‌కి. తాము సీబీఐ అధికారులం అని, నీ వీడియో యూట్యూబ్‌లో వచ్చిందని, వెంటనే డబ్బులు ఇచ్చి దానిని డిలీట్ చేయించుకోవాలని బెదిరించారు. కొన్ని మెస్సేజులు కూడా పంపారు. వారి వేధింపులకు తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను రక్షించాలని వేడుకున్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన‌ పోలీసులు దీనిపై సీరియ‌స్‌గా ఫోక‌స్‌పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement