Sunday, January 5, 2025

AP | మధ్యాహ్న భోజనం… శనివారం మెనూలో మార్పులు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజనంలో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అందిస్తున్న మెనూలో మార్పులు చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

శనివారం ఆకు కూర అన్నం (పాలకూర, కొత్తిమేర, కరివేపాకు, పుదీన) పప్పుచారు, స్వీట్‌ పొంగల్‌, రాగిజావ ఇవ్వాలని తెలిపారు. మిగిలిన రోజులలో రైస్‌, సాంబార్‌, వెజిటేబుల్‌ కర్రీ (స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలు), స్వీట్‌ పొంగల్‌, రాగిజావ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీలు, డీఈవోలు అమలు చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement