స్కూళ్ల విలీనం జరగలేదని.. కేవలం క్లాసుల విలీనమే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాణ అన్నారు. ప్రభుత్వ విద్యావిధానంలో మార్పుల ప్రకారమే విలీనం ఉంటుందన్నారు. 5,800 స్కూళ్లను మ్యాపింగ్ చేసి విలీనం చేశామని పేర్కొన్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. పేద పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని వివరించారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనవసర ప్రచారం చేసి ప్రజల్లో ఆందోళన కలిగించవద్దన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement