Wednesday, November 20, 2024

Memantaa siddam | మరో 2 నెలల్లో మళ్లీ “జగన్ అనే నేను”

కొనకనమిట్ల : పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు పెద్ద శాడిస్టు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొనకనమిట్లలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుది దారి అడ్డదారి అని.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు. అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడ‌ని… నేను సంక్షేమానికి వినియోగించానని. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి అని అన్నారు. మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్‌ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల సాధికారితకు పెద్దపీట వేశామని.. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్‌ అందించామని, వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నామని సీఎం జగన్‌ వివరించారు.

ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించామన్నారు. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని.. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీఎం జగన్ విమర్శించారు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారన్నారు 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారని.. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసన్నారు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. నెలకు రూ.2వేలు ఇచ్చారా?” అంటూ సీఎం జగన్‌ నిలదీశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement