Friday, November 22, 2024

బొల్లినేనితో జ‌త‌క‌ట్టిన మేక‌పాటి

కలిగిరి, మే 12 (ప్రభ న్యూస్) : ఉదయగిరి అభివృద్ధి కోసమే సస్పెండ్ అయిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ఉదయగిరి మెట్ట ప్రాంతమని అభివృద్ధి చందాలంటే అధికారంలోకి రాబోయే పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఉదయగిరిలో టూరిజం, రోడ్లు, సాగునీరు తదితర సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. అనంతరం బొల్లినేని రామారావు తమ కార్యకర్తలను పరిచయం చేస్తూ వీరంతా మీ బాధితులేనని మేకపాటికి తెలుపగా.. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరాడు. అనంతరం బొల్లినేని మాట్లాడుతూ… వైఎస్ కు, జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందని కక్షపూర్వకంగానే ఇన్చార్జిల పేరుతో శేఖర్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం బాధాకరమ‌న్నారు.

గతంలో రాజకీయంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇద్దరం చేసుకొనే విషయం వాస్తవమేనని, అవి రాజకీయంగా ఉండాలే తప్ప కక్ష పూరితంగా ఉండకూడదన్నారు. జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచాడని బొల్లినేని విమర్శించాడు. జిల్లా అధిష్టానం ఆదేశాల మేరకే మేకపాటితో భేటీ అవ్వడం జరిగిందన్నారు. క్యాడర్ సహకరిస్తే 2024లో ఉదయగిరిలో పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పార్టీ పరంగా అన్యాయం జరిగిన మేకపాటికి కూడా అండగా ఉంటామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు జయచంద్రారెడ్డి, కార్య దర్శి కాకు మహేష్ నాయకులు సిహెచ్, తాతయ్య, ఎస్.కొండయ్య, వెంగప నాయుడు, పి.సుబ్బారావు, కర్నాటి, ప్రభాకర్, రాంబాబు, గురిజాల వాసు, ఓ.మాల్యాద్రి, మధు, జి.నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement