దుత్తలూరు, మే 09(ప్రభ న్యూస్) రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి.చంద్ర శేఖర రెడ్డి తెలిపారు.ఆయన దుత్త లూరులో మాజీ శాసన సభ్యులు కంభం విజయరా మిరెడ్డి తో కలసి ఉదయగిరి నియోజక వర్గ రాజకీయాలు గురించి చర్చించారు. ఉదయగిరి నియోజక వర్గ అభివృద్ది కోసం టీడీపీ నేతలతో కలసి పన్ని చేయుటకు సిద్దంగా ఉన్నానని ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ శాసన సభ్యులుగా ఉన్నానని తెలిపారు.ఈ నియోజక వర్గంలో కంభం విజయ రామిరెడ్డి,నేను ప్రతి ఒక్కరికీ తెలుసునని తెలిపారు.కంభం విజయరామిరెడ్డి తో కలసి ఉదయగిరి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.రాబోవు ఎన్నికలలో మన ప్రభుత్వం వస్తుందని అందరం కలసి అభివృద్ది చేద్దాం అన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి చీదర్ల.మల్లికార్జున,టీడీపి నేతలు కాకర్ల మధు సుధన్ రెడ్డి,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి వైఎస్సార్ ,టీడీపీ పార్టీ నేతలో కలవరం
నిన్నటి వరకు తూర్పు,పడమర ఎదురెదురు ధృవాలు గా ఉన్న మేకపాటి చంద్ర శేఖర రెడ్డి, మాజీ శాసన సభ్యులు కంభం విజయ రామిరెడ్డి లు అకస్మాత్తుగా కలవడంతో రెండు ప్రధాన పార్టీ నేతలు కలవర పడుతున్నారు.ఇటీవల కాలంలో మేకపాటి చంద్ర శేఖర రెడ్డి వైఎస్సార్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యిన తర్వాత ఉదయగిరి ఇన్ ఛార్జ్ పదవి పై ఊహాగానాలు తెరలెచ్చాయి. ఉదయగిరి నియోజక వర్గ ఇంచార్జీ గా మేకపాటి కుటుంబానికి చెందిన వారికే ఉండాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రి నీ కొరతుండటం తో మేకపాటి రాజగోపాల్ రెడ్డి కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నియోజక వర్గ ప్రజల లో ఊహాగానాలు ఊపందు కొన్నాయి. మేకపాటి.చంద్ర శేఖర రెడ్డి అకస్మాత్తుగా టీడీపి నేత కంభం విజయ రామిరెడ్డి తో కలసి చర్చించడం తో మేక పాటి వర్గీయుల లో కలవరం మొదలైంది. వైఎస్సార్ పార్టీ నాయకులు అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తో కలసి పన్ని చెయ్యాలా లేదా చంద్ర శేఖర రెడ్డి తో కలసి పన్ని చెయ్యాలా అన్నే సందిగ్ధంలో ఉన్నారు. ఉదయగిరి నియోజక వర్గ టీడీపి నేతలు ఇటీవల వరకు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి తో గ్రామాలలో వర్గ పోరు ఎదురుకొంటు ఉన్నారు. ఇప్పుడు టీడీపి నేతలతో కలసి పన్ని చేయుటకు సిద్దంగా ఉన్నానని మేకపాటి చంద్ర శేఖరరెడ్డి తెలపడంతో టీడీపి నేతలో కలవరం మొదలైంది.