అమరావతి, ఆంధ్రప్రభ ; రాష్టంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఈనెల 23న సచివాలయంలో కమిటీ సమావేశం కానున్నది. పారిశ్రామిక ప్రమాదాల సంభవనీయతను హైబ్రిడ్ మోడ్‌లో అన్ని కంపెనీల విభాగాలపై ఈ కమిటీ సమీక్షించనుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఇండియా, అపెరల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ సెజ్‌లో ఉన్న సీడ్స్ ఇంటిమేట్, అపెరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణకు థర్డ్ పార్టీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని భద్రత మరియు పర్యావరణ అవసరాలకు అనుగుణంగా అన్ని పారిశ్రామిక యూనిట్లను ధృవీకరించడానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో భద్రతా సమస్యలపై ఫ్యాక్టరీ డైరెక్టర్, పర్యావరణ సమస్యపై పిపిటిని సమర్పించాలని ఎపిపిసిబి సభ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పిపిటి) ఇవ్వనున్నారు. ఈసమావేశం అనంతరం పారిశ్రామిక ప్రమాదాల నియంత్రణకు జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులకు సమగ్ర సూచనలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా పారిశ్రామిక ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈకమిటీలో సూచించిన ప్రణాళికలు తూ.చ.తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.