అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సిఇఓగా ఉన్న విజయానంద్ స్ధానంలో 1998 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ప్రధాన ఎన్నికల అధికారిగా గురువారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు (ఆహార శుద్ది), అర్ధిక ( వాణిజ్య పన్నులు), చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా ఉన్న మీనాకు ఈ పదవితో కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లయ్యింది.
తన సర్వీసులో భాగంగా పలు పదవులను అలంకరించిన మీనా తనదైన శైలిలో పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. తన పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం, కర్నూలు కలెక్టర్, సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్ధ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్ధ ఎండి, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి, రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలో మీనా రాణించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..