Thursday, September 12, 2024

Medicos Strike – దేశ వ్యాప్తంగా స్థంభించిన వైద్య సేవ‌లు ….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – కోల్ కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా వైద్యుల నిరసన ఉదృ తం అవుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది.. దీంతో దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో అత్య‌వ‌స‌ర సేవ‌లు మినహా అన్ని స‌ర్వీస్ లు నిలిచిపోయాయి..

ఇది ఇలా ఉంటే కోల్ కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ 31 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటన కోల్ కతాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు నిరసనలు, సమ్మెలకు దిగాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 24గంటల పాటు సమ్మె చేపట్టనున్నట్లు ఐఎంఏ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి వైద్య వర్గాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేప‌థ్యంలోనే వైద్య‌లు విధుల బ‌హిష్క‌రించి స‌మ్మెకు దిగారు..

ఏ సేవలు పనిచేస్తాయి? ఏవి పనిచేయవు?

- Advertisement -
  • శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు స‌మ్మె కొనసాగ‌నుంది
  • ఈ వారాంతంలో చాలా ఆసుపత్రి విభాగాలు బంద్ ఉంటాయి. సాధారణ ఔట్ పేషెంట్ విభాగాలు (ఓపీడీలు), ఎలక్టివ్ సర్జరీలు బంద్ కానున్నాయి.
  • ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
  • ఏవైనా ఎమర్జెన్సీ వైద్య అవసరాలు తలెత్తితే వాటిని కొనసాగించే విధంగా క్యాజువాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement