కర్నూలు, (ప్రభ న్యూస్) : మెడికవర్ ఆధ్వర్యంలో ఇక నుంచి ఇంటి వద్దకే వైద్య సేవలను అందించనున్నారు.బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడప దగ్గరకే వైద్యసేవలు కార్యక్రమం మెడికవర్ హాస్పటల్ ప్రారంభించడం సంతోసంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.
రక్త పరీక్షల నమూనాలను సేకరించడం, ప్రాథమిక వైద్యానికి కేవలం రూ. 500 , నర్సింగ్ సేవలు, ఫిజియోథెరఫి వంటి సేవలు అందిస్తున్నామని హాస్పిటల్ నిర్వాహకులు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, మేయర్ బివై .రామయ్య . ఎమ్మెల్యేలు రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి , కుడా చైర్మన్ , హర్షవర్తన్ రెడ్డి పాల్గొన్నారు .