అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు గురువారంనాడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. చంద్రబాబు ఎడమ కంటికి మూడు మాసాల క్రితం కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరపాల్సి ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై అత్యవసరం గా విచారణ జరిపించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ జరపాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ లో ఆయన తరపు లాయర్లు కోరారు.